సుపరిపాలనతో భారత్ దేశం వికసిత్ భారత్-టీబీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచంద్రరావు

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా విమోచన దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం తెలంగాణ విమోచనం కోసం పోరాడిన అనేకమంది పోరాట యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్ , పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతమ్ రావు , శ్రీ వీరేందర్ గౌడ్, వేముల అశోక్ , బిజెపి తమిళనాడు, కర్ణాటక ఇంచార్జ్ సుధాకర్ రెడ్డి , ఎమ్మెల్సీ అంజి రెడ్డి , వివిధ మోర్చాల అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ “ఈరోజు 17 సెప్టెంబర్, మన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. దేశంలో ప్రతి సంవత్సరం మనం 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం గా జరుపుకుంటాం. కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు, నాడు హైదరాబాద్ సంస్థానంలో 1948 సెప్టెంబర్ 17 వరకు స్వాతంత్య్రం రాలేదు.ఆ రోజు ఆపరేషన్ పోలో ద్వారా నియంత నిజాంకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వంలో హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నేతృత్వంలో చరిత్రాత్మక పోలీస్ యాక్షన్ ద్వారా తెలంగాణను భారతదేశంలో అంతర్భాగంగా చేసుకోవడం జరిగింది ” అని తెలిపారు.
ఈ విజయం వెనుక అనేక మంది త్యాగాలు ఉన్నాయి. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి, కాసిం రజ్వీ ఏర్పాటు చేసిన రజాకార్ల సైన్యం హైదరాబాద్ సంస్థానంలో అనేకమంది అమాయకులను వేధించారు, మహిళలపై అత్యాచారాలకు ఒడిగట్టారు. అనేకమంది ప్రాణాలు బలితీసుకున్నారు.బైరాన్ పల్లి, పరకాల, గుండ్రాంపల్లి, నిర్మల్ వంటి అనేక ప్రదేశాల్లో రజాకార్లు మహిళలపై వేధింపులు జరిగాయి. దాడులు చేశారు. రజాకార్లపై ఈ ప్రాంతాల్లో అనేకమంది పోరాటం చేశారు.ఈ చరిత్ర మనందరికీ గుర్తుగా నిలిచిపోవాలి. అప్పుడు జరిగిన సంఘటనలు మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఈరోజు మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే… నియంత నిజాం వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు చేసిన పోరాటం.హైదరాబాద్ స్టేట్ అప్పట్లో మన ప్రజలు నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి, స్మరించుకోదగిన త్యాగాలు చేశారు అని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
గత 25 సంవత్సరాలుగా మన భారతీయ జనతా పార్టీ .. ఆ పోరాటయోధులను స్మరించుకునేలా, తెలంగాణ లిబరేషన్ డే ని అధికారికంగా జరుపుకోవాలని నిరంతరం పోరాటం చేస్తోంది.ప్రతి ఏడాది 17 సెప్టెంబర్ రోజును తెలంగాణ ప్రజల హృదయాలను కదిలించే, గౌరవింపదగిన దినంగా గుర్తించాలి.సర్దార్ వల్లభాయి పటేల్ గారు ఆపరేషన్ పోలో ద్వారా పోలీస్ యాక్షన్ సిన కీలక పాత్ర లేకపోతే, ఈ ప్రాంతం పాకిస్తాన్ లేదా మరో స్వతంత్ర దేశంగా ఉండే పరిస్థితి ఏర్పడేది.పోరాటయోధుల త్యాగాన్ని మర్చిపోకుండా, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవాలి. మహారాష్ట్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం కూడా ముక్తి దివస్ గా అధికారికంగా వేడుకలు జరుపుకుంటున్నాయి.కానీ తెలంగాణలో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రయోజనార్థం మాత్రమే సెప్టెంబరు 17ను రోజును రాజకీయ కార్యక్రమాలుగా నిర్వహిస్తూ, అధికారికంగా జరుపుకోవడాన్ని వదిలేసింది.కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి ప్రేరణతో హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు.
మన భారత సైనిక, కేంద్ర బలగాలు కూడా ఈ సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను గత మూడు సంవత్సరాలుగా నిర్వహించుకోవడం జరుగుతోంది. మొదటిసారి తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను అమిత్ షా ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించి వందనం చేశారు.ఈరోజు సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించ నున్నారు.సెప్టెంబరు 17 విమోచన దినోత్సవ వేడులు అధికారికంగా జరుపుకుంటున్నామంటే.. ఈ ప్రయత్నం కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుల వల్లే సాధ్యమైంది.అందుకే ఈ రోజు మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కి, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, అవినీతిరహింత, సుపరిపాలనతో భారత్ దేశం వికసిత్ భారత్ గా ఎదుగుతోంది.ఈరోజు విశ్వకర్మ దినోత్సవం కావడంతో, దేశ నిర్మాణం కోసం కృషి చేస్తున్న శ్రామికుల సేవలను గుర్తుచేసుకుంటూ, విశ్వకర్మ మహర్షిని స్మరించుకోవాలి.ఇన్ని కార్యక్రమాల మధ్య కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకునేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ముందుకొచ్చి భాగస్వామ్యం కావడం అభినందనీయం అని అన్నారు.
Related News
-
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఆఫీసులో దేశ సమైక్యతా దినోత్సవం
-
సమాజ నిర్మాణ కర్తలు విశ్వకర్మలు-మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
-
తెలంగాణ విమోచన వేడుకల్లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
తెలంగాణ విమోచన దినోత్సవం గురించి బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్
-
సకల జనుల సమ్మేళనంతో బతుకమ్మ ఉత్సవాలు
-
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విమోచన దినోత్సవ వేడుకలు