ఎంత మోసం.. యాపిల్ ఫోన్ బుక్ చేస్తే.. యాపిల్ పండ్లు ఇచ్చారు
ఆన్ లైన్ అంటే మోసం.. మనం ఒకటి బుక్ చేస్తే.. మరోకొటి వస్తుంటుంది… ఇలాంటి ఘటనలు ఎన్నో. తాజాగా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. స్పెషల్ ఆఫర్లో కేవలం 12వేల రూపాయలకే యాపిల్ ఫోన్ అనే యాడ్ చూసి టెంప్ట్ అయిన ఓ వ్యక్తి మోసపోయాడు.
ఏపీలోని తాడేపల్లిగూడేనికి చెందిన ఓ యువకుడికి ఫేస్ బుక్ లో యాపిల్ పోన్ పై స్పెషల్ ఆఫర్ కనిపించింది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇంకేముందు.. తక్కువ ధరకే యాపిల్ ఫోన్ అంటే.. అది నిజమా?.. కాదా? అని ఆలోచించకుండా వెంటనే బుక్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి కొరియర్ రాగానే రూ.12వేలు చెల్లించి తీసుకున్నాడు.
ఎంతో ఆతృతతో ఓపెన్ చేస్తే యాపిల్ పండ్లు కనిపించడంతో కంగుతిన్నాడు. యాడ్ లో రిటర్న్ ఆప్షన్ లేకపోవడం.. ఉన్న ఫోన్ నంబర్ పనిచేయకపోవడంతో తాను మోసపోయనని తెలసుకున్నాడు. తనకు ఎదురైన ఈ ఘటనను సోషల్ మీడియా ద్వారా సదరు యుకుడు వెల్లడించాడు.



