10 రోజులు తిరిగి.. ఖాళీ చేతులతో వచ్చాడు: కేఏ పాల్ ఫైర్
పల్లవి, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఖాళీ చేతులతో హైదరాబాద్ తిరిగొచ్చారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పది రోజుల పాటు విదేశాల్లో తిరిగి ఖాళీ చేతులతో రాష్ట్రానికి రావడం సిగ్గుచేటన్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్‌తో పాటు ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయా అని ప్రశ్నించారు.
‘సీఎంలను అమెరికా తీసుకుపోతానని గతంలో రేవంత్ రెడ్డికి చెప్పాను. అమెజాన్, టెస్లా సీఈవోలను కలుద్దామని చెప్పాను. వారం రోజుల్లో ఆస్టిన్, డల్లాస్, న్యూయార్క్, లాస్ ఏంజెల్స్‌తో పాటు మరిన్ని నగరాలకు వెళ్దామన్నాను. కానీ నాతో రాలేదు. ఇప్పుడు ఎన్ని ట్రిప్పులు వేసినా రాజకీయ నాయకులను ఎవరు నమ్మరని రేవంత్ రెడ్డికి అర్థమైంది.



