హైడ్రా నెక్ట్స్ టార్గెట్ వీళ్లే..!
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కమిషన్ అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను నిర్ధాక్షిణంగా కూల్చివేస్తూ హైడ్రా సంచలనంగా మారింది. శనివారం ఉదయం హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూడా నేలమట్టం చేసింది. ఆప్పుడు ఎవరి అక్రమ కట్టడాలను కూల్చివేస్తుందోనని ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
అయితే, హైడ్రా నెక్ట్స్ టార్గెట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డేనని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ శివారులో మల్లారెడ్డి కాలేజీని చెరువులోనే నిర్మించారంటూ హైడ్రాకు భారీగా ఫిర్యాదులొస్తున్నాయి. మరోవైపు, పల్లాకు చెందిన అనురాగ్ కాలేజీ కూడా అక్రమ నిర్మాణమేనని ఆరోపణలున్నాయి. ఆయన ఆక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు ఫిర్యాదు రావడంతో నిన్న పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కాబట్టి వీరిద్దరి అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేయనున్నట్లు తెలుస్తోంది.



