సలకం చెరువుకు బుల్డోజర్లు పోవా?
సలకం చెరువుకు బుల్డోజర్లు పోవా?

పల్లవి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా దూకుడు పెంచింది. శనివారం ఒకే రోజు మూడు చోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. ప్రభుత్వ భూములను కబ్జా చెర నుంచి విడిపించింది. అయితే సలకం చెరువును సగం ఆక్రమించి నిర్మించిన ఫాతిమా విద్యా సంస్థలను ఇప్పటి వరకు హైడ్రా కనీసం టచ్చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చేసిన హైడ్రాకు సలకం చెరువులోని ఓవైసీ బద్రర్స్‌కు చెందిన అక్రమ కట్టడాలపై ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదులు అందాయి. హైదరాబాద్ జిల్లా ఓల్డ్‌సిటీలోని బండ్లగూడ మండల పరిధిలోని సలకం చెరువులో ఓవైసీ బ్రదర్స్ అక్రమంగా విద్యాసంస్థలు నిర్మించారని హైడ్రాకు పలువురు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. చెరువును సగం ఆక్రమించి ఫాతిమా విద్యాసంస్థలు నిర్మించారని అసద్‌పై ఆరోపణలు ఉన్నాయి. చెరువులోనే బిల్డింగులు కనిపిస్తున్నా ఎందుకు కూల్చడంలేదని ఎక్స్‌లో సీఎం రేవంత్‌ను, హైడ్రా కమిషనర్రంగనాథ్ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎంపీ అసదుద్దీన్, అక్బరుద్దీన్లు కూడా హైడ్రా కూల్చివేతలపై స్పందించారు. కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా చెరువు ఎఫ్టీఎల్లో కట్టారని, వాటిని కూల్చుతారా అంటూ ప్రశ్నించారు.
ఛాలెంజ్విసిరిన అక్బరుద్దీన్
హైడ్రాపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీజేఎల్పీనేత మహేశ్వర్‌రెడ్డి వేసిన ప్రశ్నకు అక్బరుద్దీన్స్పందిస్తూ.. ‘కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. ఆ స్కూల్ కూల్చకండి.పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించా. వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారు. గతంలో నాపై కాల్పులు జరిగాయి. కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి.కత్తులతో దాడి చేయండి. పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి’’ అంటూ మండిపడ్డారు. అప్పటి వరకు ఫాతిమా కాలేజీలను హైడ్రా కూల్చబోతున్నదన్న వార్తలు వచ్చినా.. అక్బరుద్దీన్ఛాలెంజ్తర్వాత హైడ్రా సలకం చెరువు వైపే చూడలేదు.
హైడ్రా కమిషనర్స్పందించినా..
హైదరాబాద్‌కు చెందిన పలువురు బీజేపీ నాయకులు హైడ్రా కమిషనర్‌ను కలిసి సలకం చెరువు సహా నగరంలో ఆక్రమణకు గురైన పలు చెరువులకు సంబంధించిన వివరాలను ఇచ్చారు. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఏ కట్టడం ఉన్నా కూల్చేస్తామని స్పష్టం చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు ఉంటే హైడ్రా నోటీసులు ఇవ్వదని, నేరుగా కూల్చేస్తుందన్నారు. రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారబోదన్నారు. ఒవైసీ లేదా మల్లారెడ్డి అని హైడ్రా చూడదని… కానీ విద్యార్థుల భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచిస్తామన్నారు. చెరువులను ఆక్రమించి కాలేజీలు నిర్మాణం చేయడం పొరపాటే అన్నారు. ఎఫ్టీఎల్ అనేది చాలా ముఖ్యమన్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి… అలాంటి కాలేజీలకు కొంత సమయం ఇస్తామన్నారు. పార్టీలకు అతీతంగా చర్యలు ఉంటాయన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ధర్మసత్రం ఉన్నా కూల్చేస్తామన్నారు. కానీ హైడ్రా కమిషనర్రంగనాథ్చెప్పినట్లుగా విద్యా సంవత్సరం పూర్తి కావొచ్చింది. ఇప్పుడైనా సలకం చెరువు ఆక్రమణలపై హైడ్రా చర్యలు తీసుకుంటుందా? అంటూ నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్సర్కారు వెనక్కి తగ్గిందా?
హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణలకు సంబంధించి అత్యంత దూకుడుగా వ్యవహరించిన హైడ్రా.. నగరంలో వందల ఎకరాల భూములను కబ్జాల చెర నుంచి రక్షించింది. సినీ హీరో నాగార్జున ఎన్కన్వెన్షన్ ను కూల్చడం సహా ఎక్కడా వెనక్కి తగ్గని హైడ్రా.. సలకం చెరువులో ఉన్న ఒవైసీ సోదరుల ఫాతిమా విద్యాసంస్థలను మాత్రం టచ్చేయలేపోయింది. దీనిపై చాలా మంది అభ్యంతరాలు తెలిపినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఒవైసీ కాలేజీని హైడ్రా వంద శాతం కూల్చివేస్తుందని కాంగ్రెస్ నేత మహమ్మద్ ఫిరోజ్‌ఖాన్ లాంటి వారు మీడియా సమక్షంలోనే మాట్లాడినా.. సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.