హైడ్రా ఒక బ్లాక్ మెయిల్ దందా : మాజీ మంత్రి కేటీఆర్.
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థ అంటేనే ఒక బ్లాక్ మెయిల్ దందా అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఇటీవల స్థానిక కార్పోరేటర్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్ధీన్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన సర్దార్ కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ” రెడ్ల్ ఇళ్లు, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు, కాంగ్రెస్ నాయకుల ఇళ్లు ఎఫ్టీఎల్ , బఫర్ జోన్, చెరువు మధ్యలో ఉన్నా హైడ్రా ఏమి చేయదన్నారు.
కానీ గరీబ్ కుటుంబం ఒక ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నా తమ ప్రతాపం చూపిస్తోందని” ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ వేధింపులు తాళలేక సర్దార్ సూసైడ్ చేసుకోవడం తనను బాధించిందని పేర్కొన్నారు.



