హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం..!

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో గురువారం కురిసిన భారీ వర్షం నుంచి కోలుకోకముందే ఈరోజు శుక్రవారం పలు చోట్ల భారీ వర్షం పడింది. హైదరాబాద్ నగరంలో ఉప్పల్, సికింద్రాబాద్ , పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో భారీ వర్షం పడింది.
ఖైరతాబాద్, చార్మీనార్, ఎల్బీనగర్ , శేరిలింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ భారీ వర్షంతో పలుచోట్ల రోడ్లు, కాలనీలు జలమయ్యాయి. పలుకూడళ్లల్లో ట్రాఫిక్ తో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, జలమండలి సిబ్బంది , హైడ్రా ఫోర్స్ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.