హరీశ్ రావుకు హైడ్రా బాధితుల విషెస్
హరీశ్ రావుకు హైడ్రా బాధితుల విషెస్

పల్లవి, వెబ్ డెస్క్: హరీష్ రావుకు హైడ్రా బాధితుల ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు హైదర్షాకోట్ డ్రీమ్ హోమ్ కాలనీవాసులు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ఆందోళనకు గురై కన్నీరు మున్నీరైన తమకు హరీష్ రావు ధైర్యం చెప్పి అండగా నిలిచారని కాలనీ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హైడ్రా కూల్చివేతలతో తమ సొంత ఇళ్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర మనోవేదనకు గురైన వారు ఐదు నెలల క్రితం తెలంగాణ భవన్‌కి వచ్చి తమ గోడును వెళ్లబోసుకోవడంతో.. హరీష్ రావు వారి సమస్యను అర్థం చేసుకొని కాలనీకి స్వయంగా వెళ్లి హైడ్రా చర్యలను అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాన్ని బాధితుల తరపున నిలదీశారు. తాము ఆపదలో ఉన్నప్పుడు హరీష్ రావు తమకు అండగా నిలిచారని, ఆ సాయం తాము ఎప్పటికీ మరిచిపోలేం అని కాలనీవాసులు తెలిపారు.