పహాల్ గామ్ ఉగ్రదాడి- ఓవైసీ సంచలన వ్యాఖ్యలు..!

కశ్మీర్ పహాల్ గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి గురించి ఎంఐఎం అధినేత.. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అందుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ మనం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోకి చొరబడటం కాదు. మనమే అక్కడే ఉండిపోవాలి.
దాడులకు ప్రతిదాడులు చేయడం కాదు. ఉగ్రవాద సమస్యకు శాశ్వతంగా పరిష్కార మార్గం చూపించాలి. చొరబడి దాడులు చేయడం కాదు. ఉగ్రవాదులు చొరబడకుండా వాళ్లకు గుణపాఠం చెప్పాలి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ సాక్షాత్తు పార్లమెంట్ లోనే బీజేపీ ప్రభుత్వం పీఓకే భారత్ లోని అంతర్భాగం అని తీర్మానం చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బీజేపీ నేతలు ఘర్ మే ఘుస్ కే మారేంగే( ఇంట్లో చొరబడి కొడతాం) అని అంటున్నారు. నేను ‘ఘర్ మే ఘుస్ కే బైఠ్ జావో’ (ఇంట్లోకి చొరబడి కూర్చోండి) అంటున్నాను. ఈ ఉగ్రవాదానికి ఇక ముగింపు పలకాలి” ..కేవలం దాడులు చేసి వెనక్కి రావడం కాదు. అక్కడే ఉగ్రవాదాన్ని అంతమొందించి స్థిరంగా ఉండిపోవాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద శిబిరాలను ఇస్లామాబాద్ తరలిస్తుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒవైసీ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ జరుగుతుంది.
Related News
-
చిరునవ్వుతోనే మత్తెక్కిస్తోన్న ప్రగ్యా జైస్వాల్
-
అల్లరి నరేష్ హీరోగా సరికొత్త మూవీ
-
రోడ్లపై రైతులు.. స్టార్ హోటల్లో మంత్రులు-మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
-
నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
-
గణేశ్ లడ్డూను దక్కించుకున్న ముస్లిం మహిళ
-
CSR నిధులతో గురుకులాలు అభివృద్ధి – మంత్రి దామోదర