డ్యాన్స్ రాదని వెక్కిరించారు.. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా: భాగ్యశ్రీ
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ మూవీతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ క్రమంలో రవితేజ, భాగ్యశ్రీ ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు.
ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ తన డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను, రవితేజ డ్యాన్స్ చేయడంలో ఎక్స్పర్ట్స్ కాదని చెప్పింది. ‘నేను చిన్నతనంలో బొద్దుగా ఉండడంతో డ్యాన్స్ చేయలేకపోయేదాన్ని. అది చూసి చాలా మంది వెక్కిరించారు.పెద్దయ్యాక ఎలాగైనా మంచి డ్యాన్సర్ కావాలని ఫిక్స్ అయ్యారు. అలా డ్యాన్స్ ను ఎంజాయ్ చేయడం తెలుసుకున్నా. ఎప్పుడైన డల్ అనిపిస్తే డ్యాన్స్, మ్యూజిక్ తోనే చిల్ అవుతా’ అని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది.



