పుస్తెలు తెగడం, మద్యం సేవించడంలో తెలంగాణదే మొదటి స్థానం
తెలంగాణలో ఎన్నికల హీట్ మొదలైంది. నేతలంగా ప్రచారం హోరులో బిజీగా ఉన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ఆక్రుతి టౌన్ షిప్ వాసులతో బ్రేక్ ఫాస్ట్ మీట్ లో పాల్గొన్నారు ఈటెల రాజేందర్. ప్రధాని మోదీని గెలిపించాలని ఈసందర్భంగా వారిని కోరారు. ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ధరణిని కేసీఆర్ తీసుకువచ్చారని..కానీ ధరణి వల్ల ఎంతో మంది నష్టపోతున్నారని తెలిపారు. తెలంగాణ అన్నింటా మొదటిస్థానంలో ఉందని..పుస్తెలు తెగడంలో కూడా మొదటిస్థానంలోనే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం సేవించడంలో కూడా తెలంగాణదే నెంబర్ వన్ అన్నారు. ఒక్కప్పుడు పండగలకు మాత్రమే తాగేవారని ఇప్పుడు తాగడం రోజువారీ పనిగా మారిపోయిందన్నారు. దీనిని నివారించాలన్నారు.
బోడుప్పల్లో ఓ కార్పొరేటర్ అపార్ట్ మెంట్స్ మధ్యలో వైన్ షాప్ ప్రారంభించారని దానితో అక్కడ నివసిస్తున్న వాళ్లకు ఎంతో ఇబ్బంది కలుగుతుందని తెలిపారు. వారు పలుమార్లు సమస్య తనకు చెప్పుకున్నారని..కేవలం తన వ్యాపారాన్ని కాపాడుకునేందుు మాత్రమే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారారన్నారు. ఈ పదేళ్ల కాలంలో మోదీ తలవంచుకునే పని చేశారా అనిప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టౌన్ షిప్ వాసులు, నాయకులు, కార్యకర్తలు పెద్దెత్తున పాల్గొన్నారు.



