బీజేపీని నమ్మి ఓటేస్తే ఇగ ఆగమే..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.!
బీజేపీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని నమ్మి ఓట్లేస్తే ఇగ ఆగమైనట్లేనని హెచ్చరించారు కేటీఆర్. వాళ్లు 400సీట్ల గురించి కాదని..పెట్రోల్ రేట్ల గురించంటూ ఎద్దేవా చేశారు. బీజేపీని నమ్మి 400సీట్లు ఇస్తే..పెట్రోల్ ధర రూ. 400కు చేరుతుందంటూ చమత్కరించారు. ఎక్స్ ఖాతాలో కేటీఆర్ ఓ పోస్టును పెట్టారు. ఆ పోస్టుకు నవ్వుతున్న ఎమోజీని యాడ్ చేశారు. అదేవిధంగా 2014లో రూ. 70గా ఉన్న పెట్రోల్ ధర 2024 నాటికి రూ. 110 చేరిందని అంకెలతో సహా పోస్టులో సూచించారు. బీజేపీని నమ్మి ఓట్లేస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 400 కు చేరుకుంటుందేమోనని ఆ కఅంకెలతోనే అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్.
అంతేకాదు ఈ పోస్టుకు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం చేసిన ఓ ప్రకటనను కూడా కేటీఆర్ జతచేశారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే పెట్రోల్ ధర రూ.400 కు చేరుతుందన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రకటనను చేయించింది. ఈ యాడ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.



