మందుబాబులకు షాక్..నేటి నుంచి రెండు రోజులు వైన్స్ బంద్
మందుబాబులకు షాక్. రాష్ట్రంలో రెండు రోజులపాటు మద్యం షాపులు మూతపడనున్నాయి.మే 13న జరగనున్న లోకసభ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అధికారులు మద్యం షాపులను మూసివేయాలని నిర్ణయించారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్తగా మద్యం షాపులను మూసివేయించారు. మే 13న పోలింగ్ జరగనుండగా ముందు నుంచే బంద్ పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 48గంటలపాటు మద్యం షాపులు, కల్లు కంపౌండ్స్ మూతపడనున్నాయి.
శనివారం సాయంత్రం 6 నుంచి అన్ని వైన్ షాపులు బంద్ కానున్నాయి. తిరిగి మే 13వ తేదీన సాయంత్రం 6గంటలకు తెరుస్తారు. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటు జూన్ 4వ తేదీన ఓట్ల కౌంటింగ్ రోజు కూడా వైన్ షాపులు మూతపడనున్నాయి.



