బోడుప్పల్ విద్యార్థుల ప్రతిభ.. అభినందించిన ప్రిన్సిపల్
“ప్రతిభ ఉంటే ఎక్కడైనా విజయం మననే వరిస్తుంది”. అనే మాటలను నిజం చేశారు, పల్లవి మోడల్ స్కూల్ బోడుప్పల్ విద్యార్థులు. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు రాయచోటిలో దక్షిణ భారత స్థాయి సెకండ్ సౌత్ జోన్ టార్గెట్ బాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో తెలంగాణ రాష్ట్రం తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ జట్టులో పల్లవి మోడల్ స్కూల్ , బోడుప్పల్ విద్యార్థులు విక్రాంత్ మరియు యశ్ వర్ధన్ లు జట్టులకు ప్రాతినిధ్యం వహించి విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీ సుశీల్ కుమార్ గారు మరియు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి తనూజ గారు విద్యార్థులను మరియు కోచ్ శ్రీమతి పద్మను అభినందించారు.
Related News
-
ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు
-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
-
బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ
-
పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా హిందీ దివస్
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి) లో స్టూడెంట్ కౌన్సిల్ మీటింగ్
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి)లో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ -2025



