బోడుప్పల్ పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను పురస్కరించుకొని పల్లవి మోడల్ స్కూల్ బోడుప్పల్ లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా గత వారం రోజులుగా విద్యార్థులలో దేశభక్తి అలవాడేటట్లు పలు పోటీలను పాఠశాలలో నిర్వహించారు. క్విజ్, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు మరియు ర్యాలీ లాంటి కార్యక్రమాలను నిర్వహించారు. హర్ ఘర్ తీరంగ్ లో భాగంగా తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు జాతీయ జెండాలను బహుకరించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. విద్యార్థులందరూ దేశభక్తిని ప్రదర్శించేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన విజేతలను బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి తనూజ గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ దేశం గర్వించే పౌరులుగా ఎదగాలని, దేశాభివృద్ధికి పాటుపడాలని చిన్నారులకు తెలియజేశారు.

Related News
-
పల్లవి మోడల్ స్కూల్ లో ఘనంగా హిందీ దివస్
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి) లో స్టూడెంట్ కౌన్సిల్ మీటింగ్
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి)లో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ -2025
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి) లో ఇంటర్స్కూల్ చెస్ ఛాంపియన్షిప్ 2025..
-
పల్లవి మోడల్ స్కూల్ (బోయినపల్లి)లో వర్చువల్ మార్కెట్ యార్డ్ వేడుకలు
-
పల్లవి మోడల్ స్కూల్ లో “Debate Competition”



