IRCTC ప్యాకేజీ : ఒకే ట్రిప్‌లో అయోధ్య, వారణాసి దర్శనాలు
పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకొనే వారికి ఇండియన్ రైల్వే అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా అయోధ్య, వారణాసి పుణ్యక్షేత్రాల దర్శనం కోసం గంగా సరయూ దర్శన్ పేరిట ఓ కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. సికింద్రాబాద్, కాజీపేట, మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ నుంచి సాగే ఈ యాత్ర(5 రాత్రులు, 6 పగళ్లు) సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులో ఉంటుంది.
కాశీ విశ్వనాథ్, కాలభైరవ ఆలయం, గంగా హారతి, అయోధ్య, దశరథ్ మహల్, సరయు ఘాట్ చూడొచ్చు. ఇందులో మూడు పూటలా ఫుడ్, రూమ్స్ ఏర్పాటు చేస్తారు. ఏసీలో ట్విన్ షేరింగ్‌కు రూ. 24,350, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.19,720, స్లీపర్‌లో ట్విన్ షేరింగ్‌కు రూ.17,220, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 16,710 చెల్లించాలి.
మెదటి రోజు ఉదయం 9:25 గంటలకు సికింద్రాబాద్ (దానాపూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ నం: 12791) నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. రెండోరోజు వారణాసి, మూడో రోజు వారణాసిలో ప్రసిద్ధ ఆలయాలను (కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్ మందిర్ ) సందర్శించుకోవచ్చు. ఇక నాలుగో రోజు అయోధ్య ఆలయం, హనుమంతుని దర్శనం, దశరథ్ మహల్‌ను దర్శించుకోవచ్చు. ఐదో రోజు సాయంత్రం సికింద్రాబాద్ (ట్రైన్ నం: 12792)కు బయల్దేరి రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్ కు చేరుకుంటారు.
Related News
-
ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు
-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
-
బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ
-
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే సండ్ర
-
ఎంపీ రవిచంద్ర లేఖకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూల స్పందన
-
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి స్వాతంత్య్ర పోరాటం – మాజీ సీఎం కేసీఆర్



