హైదరాబాద్ లోని ఆ రెండు మాల్స్ కి ఎగబడుతున్న జనం..దేశంలోనే టాప్!
బిర్యానీకి,ఇరానీ ఛాయ్ కి హైదరాబాద్ ఎంత ఫేమసో షాపింగ్ కూడా అంతే ఫేమస్.
బిర్యానీకి,ఇరానీ ఛాయ్ కి హైదరాబాద్ ఎంత ఫేమసో షాపింగ్ కూడా అంతే ఫేమస్. అది స్ట్రీట్ షాపింగ్ అయినా, కమర్షియల్ బిల్డింగ్స్ లో షాపింగ్ మాల్స్ అయినా సరే. తాజాగా విడుదలైన ఓ రిపోర్ట్ హైదరాబాద్ వాసుల షాపింగ్ సత్తాని మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. హైదరాబాద్‌లోని రెండు షాపింగ్ మాల్స్.. భారతదేశంలో అత్యధికంగా సందర్శించే టాప్ 25 మాల్స్‌లో స్థానం పొందాయి. బెంగుళూరుకి చెందిన జియోఐక్యూ అనే స్టార్టప్ దేశంలో ప్రతి రోజూ అత్యధిక కస్టమర్లు సందర్శించే టాప్ 25 షాపింగ్ మాల్స్ లిస్ట్ ని రిలీజ్ చేసింది.
ఈ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ కొండాపూర్ లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ రోజుకి సగటున 19,105మంది విజిటర్స్ తో.. 9వ ప్లేస్ లో నిలిచింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ సినిమాస్ సహ యాజమాన్యంలోని లగ్జరీ మల్టీప్లెక్స్ అయిన AMB సినిమాస్ కూడా ఈ శరత్ సిటీ క్యాపిటల్ మాల్లో ఉంది. ఇక,రోజుకి సగటున 14,493 మంది విజిటర్స్ తో ఈ లిస్ట్ లో కూకట్ పల్లిలోని నెక్సస్ మాల్ 25వ ప్లేస్ లో నిలిచింది.
ఇక. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఢిల్లీ వేగాస్ మాల్ నిలిచింది. రోజుకి సగటున 26,212 మంది విజిటర్స్ తో భారతదేశంలో ఎక్కువ మంది సందర్శిస్తున్న మాల్ గా ఢిల్లీలోని వేగాస్ మాల్ నిలవగా.. రోజుకి 24,282 మంది విజిటర్స్ తో సెకండ్ ప్లేస్ లో కూడా ఢిల్లీలోపి వీ3ఎస్ ఈస్ట్ సెంటర్ మాల్ నిలిచింది. 3వ ప్లేస్ లో రోజుకి 23,000మంది విజిటర్స్ తో ముంబైలోని ఫోనిక్స్ మార్కెట్ సిటీ మాల్ ఉంది.



