బోనాల వేడుకల్లో మంత్రి వివేక్ .!

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ జియాగూడలోని శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించిన బోనాల పండుగ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మైన్స్ మరియు జియాలజీ శాఖా మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు సమర్పించిన మంత్రి రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, శాంతియుతంగా ఉండాలని మైసమ్మ తల్లిని ప్రార్థించారు. తెలుగు ప్రజల భక్తి, భగవదనిశ్ఠకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ మన సంప్రదాయాలకు, సాంస్కృతిక విలువలకు జీవం పోస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ తో పాటు స్థానిక భక్తులు, మహిళలు, ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున హాజరై భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. భక్తులతో మమేకమైన మంత్రి ఆలయ అభివృద్ధి గురించి అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.