13 మంది ఐఏఎస్‌ల బదిలీ.. స్మితా సబర్వాల్‌కు కీలక బాధ్యతలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా.. ప్రస్తుతం తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్‌గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి.. స్మితా సబర్వాల్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. యువజన సర్వీసులు, టూరిజం అండ్ కల్చరల్ సెక్రటరీగా స్మితా ను నియమిస్తూ.. రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ సర్కార్ లో కీలక బాధ్యతలు చేపట్టిన స్మితా సబర్వాల్‌కు రేవంత్ సర్కార్ ప్రాధన్యత లేని శాఖను కేటాయించిందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా బాధ్యతలు అప్పజెప్పటం పట్ల ఆమె అభిమానులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
బదిలీ అయిన ఇతర ఐఏఎస్‌లు
బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఇ.శ్రీధర్
దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఇ. శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు
మహిళ, శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అనిత రామచంద్రన్
జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబరితి
రవాణాశాఖ కమిషనర్‌గా కె. సురేంద్ర మోహన్
ఎక్సైజ్ శాఖ డైరెక్టర్‌గా సీహెచ్ హరికిరణ్
ట్రాన్స్ కో సీఎండీగా డి. కృష్ణ భాస్కర్
డిప్యూటీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్న కృష్ణభాస్కర్
ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోగా శివశంకర్
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరెక్టర్‌గా సృజన
ఇంటర్ బోర్డు కార్యదర్శిగా ఎస్. కృష్ణ ఆదిత్య



