సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా ఏనుగు నరసింహారెడ్డి

పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులుగా 11 ఏళ్లుగా కొనసాగిన డా. మామిడి హరికృష్ణ ఎట్టకేలకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డా. ఏనుగు నరసింహారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వ్యులు జారీ చేసింది.మామిడి హరికృష్ణ పని రాక్షసుడు! ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సాంస్కృతిక శాఖలో అందుబాటులో ఉండేవారు! అన్నీ తానై చేసే వారు! కరోనా సమయంలోనూ కార్యాలయాన్ని నడిపించిన ఘనత అయనదే!
ఒగ్గు డోళ్లు, నాటకం, కలరియపట్టు లాంటి వర్క్ షాపులు, డబ్బింగ్, డైరెక్షన్ కోర్సులు ప్రవేశపెట్టిన ఘనత అయనదే! ముఖ్యంగా సినీ వారం పేరిట రవీంద్రభారతి రెండవ అంతస్థు ఉచితంగా కేటాయించి లఘు చిత్రాలను ప్రోత్సహించారు. యువ దర్శకులను తీర్చి దిద్దారు! ఆయనకు స్వతహాగా సినిమా అంటే ప్రాణం! అలాగే తెలంగాణ సాహిత్యం, చరిత్ర పుస్తకాలు విరివిగా ప్రచురించారు. ప్రాచీన హోదా కోసం విశేషంగా పని చేశారు. యువ నాటకోత్సవాలు విస్తృతంగా నిర్వహించి తెలంగాణాలో నాటకానికి ఊపిరి పోశారు!.
ఇక జానపదం ప్రపంచస్థాయికి తీసుకెళ్లారు! సాంస్కృతిక సారధి ని విస్తృతం చేశారు! ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా అప్పటికప్పుడు చెప్పినా గంటల్లో వేల మంది జానపద కళాకారులను తీసుకు రావడంలో కళా ప్రదర్శనలు ఇప్పించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు! అందుకే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ఆయన బదిలీ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తూ ఇన్నేళ్లు కొనసాగించారు.
Related News
-
తీన్మార్ మల్లన్న సరికొత్త పార్టీ ..
-
ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఆఫీసులో దేశ సమైక్యతా దినోత్సవం
-
సమాజ నిర్మాణ కర్తలు విశ్వకర్మలు-మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
-
తెలంగాణ విమోచన వేడుకల్లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
సుపరిపాలనతో భారత్ దేశం వికసిత్ భారత్-టీబీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచంద్రరావు
-
తెలంగాణ విమోచన దినోత్సవం గురించి బండి సంజయ్ పవర్ ఫుల్ స్పీచ్