వేలంపాటలో భారీ ధరకు లడ్డు పాడాడు..క్షణాల్లోనే మృతి!
హైదరాబాద్ లో ఇప్పుడు గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
హైదరాబాద్ లో ఇప్పుడు గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నగరంలో ఏ వీధిలో చూసిన గణేశ్ నిమజ్జన శోభయాత్రలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పాల్గొంటూ డ్యాన్సులతో సందడి చేస్తున్నారు. అయితే గణేశ్ నవరాత్రి ఉత్సవాల ముంగింపుకు ముందు.. లడ్డు వేలం పాట ఉంటుందన్న విషయం తెలిసిందే. 9 రోజులు వినాయకుడి చేతిలో ఉంచిన లడ్డూని వేలంపాట వేస్తారు. కొన్ని చోట్ల లక్షలు,కోట్ల రూపాయాల్లో లడ్డూని వేలంపాటలో దక్కించుకుంటారు. అయితే వేలంపాటలో భారీ ధరకు వినాయకుడి లడ్డూని దక్కించుకున్న ఓ సాఫ్ట్ వేర్.. కొన్ని నిమిషాల్లో మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్ లోని మణికొండలో చోటుచేసుకుంది
మణికొండలోని అల్కపురి కాలనీలో ఉండే శ్యామ్ ప్రసాద్ ఓ ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం అల్కాపురి టౌన్ షిఫ్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన లడ్డూ వేలంపాటలో శ్యామ్ ప్రసాద్ ఏకంగా రూ. 15 లక్షలకు లడ్డూను దక్కించుకున్నాడు. వేలం పాట పాడిన తర్వాత సంతోషంగా కొద్దిసేపు గణేష్ మండపం దగ్గర డ్యాన్స్ చేసి ఇంటికెళ్లిపోయాడు శ్యామ్. అయితే ఇంటికెళ్లిన కొద్దిసేపటికే గుండెపోటుతో శ్యామ్ ప్రసాద్ మృతి చెందాడు.
ఛాతీలో నొప్పి వస్తుందని ఒక్కసారిగా కుప్పకూలిపోయిన శ్యామ్ ని వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అయితే అప్పటికే శ్యామ్ మృతి చెందినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. శ్యామ్ ప్రసాద్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అప్పటివరకు శోభాయాత్రలో సందడి చేసిన శ్యాంప్రసాద్ అంతలోనే చనిపోయాడని తెలిసి అల్కాపురి కాలనీ వాసులు విచారం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.



