నాదర్గుల్ డీపీఎస్ స్కూల్ లో ఘనంగా ప్రీ చిల్డ్రన్స్ డే

నాదర్గుల్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ప్రీ చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు బ్యాగులు లేకుండా స్కూల్ కు వచ్చి , సరదా వాతావరణంలో తమ స్నేహితులతో ఆహ్లాదకరంగా గడిపారు. ట్రామ్పోలిన్, స్కై బౌన్సీ బెలూన్, టాయ్ ట్రైన్, బాల్ పూల్ వంటి వివిధ అవుట్డోర్ గేమ్స్‌లో విద్యార్థులు పాల్గొని ఎంజాయ్ చేశారు. విద్యార్థులు తమ క్లాస్‌మేట్స్‌తో సరదాగా గడిపేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా దొరికిందని చెప్పుకోవచ్చు.