భాగ్మలక్ష్మి గుడిలో ఎమ్మెల్సీల పూజలు
భాగ్మలక్ష్మి గుడిలో ఎమ్మెల్సీల పూజలు

పల్లవి, హైదరాబాద్: ఇటీవల జరిగిన టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి శనివారం ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. వారితోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు పార్టీ సీనియర్ లీడర్లు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతోనే ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు టీచర్ల సమస్యలను గాలికి వదిలేశాయని, వాటి పరిష్కారం కోసం కచ్చితంగా టీచర్ల పక్షాన కొట్లాడుతానని కొమరయ్య తెలిపారు.
గ్రూప్ 1 అవకతవకలపై త్వరలో కార్యాచరణ
ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సాధ్యమైందన్నారు. గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లో జరిగిన అవకతవకులకు త్వరలోనే పార్టీ కార్యాచరణ రూపొందిస్తామని, వాల్యూయేషన్ సంబంధించి కూడా చాలా తప్పులు జరిగాయని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారని, వారి పక్షాన నిలబడి నిరుద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలపై పోరాటం ఉదృతం చేస్తామని తెలిపారు. బీజేపీ నాయకత్వంలో గత ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మా పోరాటం ఉంటుందని చెప్పారు. గతంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన హామీ మేరకు భాగ్యలక్ష్మి అమ్మవారిని తెలంగాణలో అధికారంలో వచ్చిన వెంటనే బంగారు తాపడంతో గుడిని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
నిరుద్యోగులు కోరుతున్నట్టు తిరిగి రీవాల్యుయేషన్ చేపట్టాలని గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకసారి జరిగిందని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులతోనే బీజేపీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచారని అన్నారు. గెలిచిన అభ్యర్థులుఆనవాయితీగా భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంటున్నదన్నారు. అమ్మవారిని చాలా కోరికలు కోరుకున్నామని అమ్మ దయతో తెలంగాణలో త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు ఆయన మీడియాకు తెలిపారు.
Related News
-
ఉపాధ్యాయుడు రవికి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పరామర్శ
-
అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి: ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
-
శ్రీవల్లి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
-
టీచర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతా: మల్క కొమరయ్య
-
విద్యకు బడ్జెట్ లో నిధులు పెంచేలా సర్కారును ఆదేశించండి: MLC మల్క కొమరయ్య
-
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ