ఉపాధ్యాయుడు రవికి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పరామర్శ

పల్లవి, వెబ్ డెస్క్ : కరీంనగర్ ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు మల్క కొమరయ్య నిన్న ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురై యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ZPHS(UM) గంభీరావుపేట లో ఎస్ఏ (ఇంగ్లీష్) ఉపాధ్యాయులు రవిని పరామర్శించారు.
ఉపాధ్యాయుడు రవికి సాయం చేయాలనే వార్తలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్సీ మల్క కొమరయ్య సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికెళ్లి రవి కుటుంబ సభ్యులతో మాట్లాడి భరోసానిచ్చారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యంతో చర్చించి ఆపదలో ఉన్న ఉపాధ్యాయుడికి మెరుగైన వైద్యం అందించాలని, ఉపాధ్యాయుడికి చికిత్స పూర్తయి డిశ్చార్జ్ జరిగేంత వరకు తమ పర్యవేక్షణ ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు.
ఇకముందు ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఆసుపత్రికి వస్తే ఆలస్యం చేయకుండా సత్వరం మెరుగైన వైద్యం ప్రారంభించాలని, ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా తాము అండగా నిలబడతామని యశోద ఆసుపత్రి యజమాన్యానికి ఎమ్మెల్సీ మల్క కొమరయ్య చెప్పారు.