హైడ్రాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్
హైడ్రాకు కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వార్నింగ్ ఇచ్చారు. పేదల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. కూకట్పల్లి సున్నం చెరువు పరిసరాల్లోని పద్మావతి నగర్ వాసులకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే స్థానికులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే మాధవరం భరోసా ఇస్తున్నారు. కూలీ పనులు చేసుకుని బతికే ఈ పేద ప్రజలపై హైడ్రా ప్రతాపం చూపిస్తే ఊరుకునేది లేదన్నారు. 40ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న వాళ్లకి నోటీసులు ఇవ్వడం ఏంటని మాధవరం ప్రశ్నించారు. ఇప్పటికే కూకట్పల్లి చేరువులన్ని సర్వే చేసి కంచెలు కూడా వేశామని తెలిపారు. ఎవరైతే చెరువులు, నాలాల దగ్గర ఇల్లు కట్టుకున్నారో వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలంటూ మాధవరం డిమాండ్ చేశారు.
Related News
-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
-
పర్యావరణహిత వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సండ్ర
-
హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం..!
-
తులం బంగారం గాలికొదిలేసిన కాంగ్రెస్ – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
-
హైడ్రా ఒక బ్లాక్ మెయిల్ దందా : మాజీ మంత్రి కేటీఆర్.
-
నీళ్లు, నిధులు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా..?- ఎమ్మెల్సీ కవిత



