నీళ్లు, నిధులు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా..?- ఎమ్మెల్సీ కవిత
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఈ నెల ఐదో తారీఖున కాళేశ్వరం కమీషన్ ఎదుట హజరవ్వాలని నోటీసులు జారీ అయిన సంగతి విధితమే. దీనికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో జాగృతి హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర ధర్నా కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ” రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ కు కాళేశ్వరం కమీషన్ పేరిట నోటీసులు ఇచ్చారు. కేసీఆర్ ఏం తప్పు చేశారు?.
నీళ్లు, నిధులు ఇవ్వడం ఆయన చేసిన తప్పా?. కాళేశ్వరం కమీషన్ అనేది కాంగ్రెస్ కమీషన్. కాళేశ్వరం పూర్తయితే ముప్పై ఐదు శాతం భూభాగానికి నీళ్లు అందుతాయి. రైతులకు నీటి కష్టం ఉండొద్దని , రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని ఈ ప్రాజెక్టు కట్టారని” ఆమె ఉద్ఘాటించారు.



