తులం బంగారం గాలికొదిలేసిన కాంగ్రెస్ – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
పల్లవి, వెబ్ డెస్క్ : తెలంగాణలో అధికారంలోకి రావడానికి అలవికానీ హామీలను ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలో తొక్కింది అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. శుక్రవారం బాలానగర్ తహసీల్దార్ కార్యాలయంలో యాబై ఆరు మందికి అర్హులైన పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కృష్ణారావు పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ’ కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది. మహిళలకు ఇచ్చిన నెలకు రెండున్నర వేలు ఇస్తామని మోసం చేశారు. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న లక్ష రూపాయలను మాత్రమే ఇస్తుంది. కానీ తులం బంగారాన్ని గాలికి వదిలేసింది అని ఆయన ఆరోపించారు.



