దీపావళి క్రాకర్స్ కాల్చేవారికి పోలీసులు షాక్
హైదరాబాద్ వాసులకు పోలీసులు షాక్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 వరకే క్రాకర్స్ కాల్చాలని ఉత్తర్వులు జారీ చేశారు
హైదరాబాద్ వాసులకు పోలీసులు షాక్ ఇచ్చారు. దీపావళి సందర్భంగా రాత్రి 8 గంటల నుంచి 10 వరకే క్రాకర్స్ కాల్చాలని ఉత్తర్వులు జారీ చేశారు. భారీ శబ్దంతో పేలే టపాసులను కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం 55 డెసిబెల్స్కు మించి శబ్దం చేసే క్రాకర్స్ కాల్చొద్దని హెచ్చరించారు. నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. టపాసులు అమ్మే షాపు యజమానులు కూడా.. లైసెన్సు లేకుండా అమ్మొద్దని పోలీసులు హెచ్చరించారు. అనుమతులు లేకుండా.. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా టపాసులు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు నవంబర్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కార్తీక మాస ఉత్సవాలను నిర్వహించాలని దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 1 వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించాలని తెలిపింది. దీపోత్సవంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్ని ఆలయాల ఈవోలు, సహాయక కమిషనర్లు ఇవి అమలయ్యేలా చూడాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.



