రేపటిలోగా హైదరాబాద్‌ను వీడండి.. పోలీసుల వార్నింగ్

కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్థానీయులను గుర్తిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్ టర్మ్ వీసాలతో ఉంటున్నట్లు గుర్తించారు. ఆదివారంలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. హైదరాబాద్‌లో మొత్తం 213 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు గుర్తించారు. వారిని పాకిస్తాన్‌కు పంపించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులకు మోడీ ప్రభుత్వం వీసా సేవలు నిలిపివేసింది. ఏప్రిల్ 27 నుంచి ఆ దేశానికి జారీ చేసిన అన్నీ విసాలు రద్దు కానున్నాయి. ఈ గడువు ముగిసేలోగా వారంతా భారత్‌ను వీడివెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది.