ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో హాలోవీన్ ఫెస్టివెల్
మహేంద్ర హిల్స్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో హాలోవీన్ ఫెస్టివెల్ ఘనంగా జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఎర్లీ ఇయర్స్ కేంబ్రిడ్జ్ వారు ఉత్సాహంతో, స్నేహపూర్వకంగా జరుపుకున్నారు

మహేంద్ర హిల్స్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో హాలోవీన్ ఫెస్టివెల్ ఘనంగా జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఎర్లీ ఇయర్స్ కేంబ్రిడ్జ్ వారు ఉత్సాహంతో, స్నేహపూర్వకంగా జరుపుకున్నారు. దెయ్యాల్లా కనిపించే డ్రెస్సులు వేసుకుని, విచిత్రమైన మేకప్ లతో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ శ్రీమతి నందితా సుంకర హాలోవీన్ వేడుక ప్రాముఖ్యతను వివరించారు. హాలోవీన్ అనేది ప్రపంచవ్యాప్తంగా సుమారు 130కి పైగా దేశాలలో అక్టోబరు 31న జరుపుకునే పండగ. ఈ పండగ సందర్భంగా చనిపోయిన సాధువులు (సెయింట్స్), అమర జీవులు దగ్గరి బంధువులు మొదలైన వారిని గుర్తు చేసుకుంటారు. ప్రాచుర్య సంస్కృతిలో భయాన్ని ఉత్సవంగా చేసుకునే పండగ ఇది.