ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గ్రాండ్‌గా ముగిసిన ఫెరియా-వై-ఫియస్టా 2.0 ప్రోగ్రామ్

హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఫెరియా-వై-ఫియస్టా 2.0 ప్రోగ్రామ్ గ్రాండ్ గా ముగిసింది. నాలుగు రోజుల పాటు సాగిన ఈవెంట్ లో విభిన్న రంగాలలో విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించించారు. ముగింపు వేడుకలో పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను గుర్తుచేసే “సేవ్ వాయనాడ్” నేపథ్యంతో నృత్య ప్రదర్శన జరిగింది.
ఈ కార్యక్రమానికి 1999 బెటాలియన్‌కు చెందిన కమాండెంట్ విజయ్ కుమార్ వర్మ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. స్కూల్ ఛైర్మన్ మల్కా కొమరయ్య పాఠశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరికి వేదికను అందించాలనే తమ నిబద్ధతకు ఈ ఈవెంట్ నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఈ ఈవెంట్ స్కూల్ క్యాలెండర్లో హైలైట్‌గా నిలిపోతుందని చెప్పుకొచ్చారు.
జంట నగరాల్లోని 50 కి పైగా పాఠశాలల నుండి 4500 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్క కొమరయ్య, సీఈవో& డైరక్టర్ యశస్వి, డైరక్టర్ పల్లవి,డైరెక్టర్ త్రిభువన, ఆర్ అండ్ ఆర్ సీనియర్ ప్రిన్సిపాల్ అండ్ డైరక్టర్ సునీతరావు, జూనియర్ ప్రిన్సిపాల్ శాంతి థోని,తదితరులు పాల్గొన్నారు.
Related News
-
ఉపఎన్నికలపై పీసీసీ చీఫ్ మహేశ్ సంచలన వ్యాఖ్యలు
-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్ధు..!
-
బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ
-
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే సండ్ర