TG 10 9999 నెంబర్‌కు ఫుల్ డిమాండ్… ధర ఎంతంటే?

వాహనాల నంబర్ ప్లేట్ల వేలంలో 2024 జులై 12వ తేదీ శుక్రవారం రోజున సికింద్రాబాద్ ఆర్టీఓకు రూ.18.28లక్షల ఆదాయం వచ్చింది. అత్యధికంగా TG 10 9999 నంబర్ రూ.6,00,999 పలికింది. దీని కోసం ఐదుగురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఆ తర్వాత TG 10A 0001కు రూ.3.60లక్షలు, TG 10A 0009 రూ.2.61లక్షలు పలికాయి. ఇక చివరగా TG-10A-000 నెంబర్ కు కేవలం రూ. 51,500కి మాత్రమే పలికింది.
కాగా గతంలో నిర్వహించిన TG సిరీస్‌లో ఫస్ట్ నంబర్ TG 09 0001కి రూ.9.61లక్షలు పలికిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో నగరంలో ఫ్యాన్సీ టీజీ ప్లేట్ల వేలం ప్రారంభం కావడంతో ఆర్టీఏకు 30 లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చింది. మార్చిలో ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో టీజీ సిరీస్‌ను విడుదల చేశారు.
మొదటి ప్లేట్, TG 09 0001, వేలంలో రూ. 9.61 లక్షలు పలకగా.. TG 09 0909, 09 0005, 09 0002, 09 0369, 09 0007 నంబర్ ప్లేట్లు వరుసగా రూ. 2.30 లక్షలు, రూ. 2.21 లక్షలు, రూ. 1.2 లక్షలు, రూ. 1.20 లక్షలు, రూ. 1,07 లక్షలు పలికాయి. వేలం ద్వారా మొత్తం ఆదాయం రూ.30 లక్షల 49 వేల 589 వచ్చాయి. కాగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో సంక్షిప్త పదాన్ని TS నుండి TG గా మార్చాలని నిర్ణయించింది.
Related News
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్ధు..!
-
బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ
-
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే సండ్ర
-
ఎంపీ రవిచంద్ర లేఖకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూల స్పందన
-
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం