రాష్ట్ర స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్లో డీపీఎస్ నాచారం విజయం
2024 డిసెంబర్ 14 వ తేదీన నిర్వహించిన రాష్ట్ర స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్లో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టీమ్ అద్భుతమైన ప్రదర్శనను కనబరించింది
2024 డిసెంబర్ 14 వ తేదీన నిర్వహించిన రాష్ట్ర స్థాయి టైక్వాండో ఛాంపియన్షిప్లో నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ టీమ్ అద్భుతమైన ప్రదర్శనను కనబరించింది. 32 మంది నైపుణ్యం కలిగిన బాలబాలికలతో కూడిన జట్టు బహుళ పతకాలు సాధించి, ప్రతిష్టాత్మకమైన ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. యువ ఛాంపియన్లను అభినందిస్తూ.. డిపిఎస్ నాచారం, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మన్ మల్క కొమరయ్య ఈ అత్యుత్తమ విజయం విద్యార్థుల అంకితభావానికి నిదర్శనమని కొనియాడారు. విద్యార్థులందరూ క్రీడలలో చురుకుగా పాల్గొనాలని…క్రీడలు క్రమశిక్షణను పెంపొందించడంలో కీలక పాత్రను పోషిస్తాయని తెలిపారు.



