అప్పుడే పెరిగిన చికెన్ ధరలు.. ఇప్పుడు కేజీ ఎంతుందంటే

నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ … శ్రావణమాసం ఎఫెక్ట్ తో కాస్త తగ్గిన చికెన్ ధరలు ఇప్పుడు మళ్లీ పెరిగాయి. గత రెండు వారాల క్రితం కేజీ చికెన్ రూ.160(స్కిన్లెస్) చొప్పున విక్రయించారు. ఇక నిన్న అంటే ఆగస్టు 21వ తేదీ నుంచి మాంసం ధరలు మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి. గురువారం డ్రెస్డ్ కేజీ ధర రూ. 187, స్కిన్లెస్ ధర రూ. 213, ఫాంరేటు రూ. 107, రిటైల్ రూ.129గా ఉంది. శ్రావణ మాసం తొలివారానికి, ఈ రోజు పోల్చితే కేజీకి ఏకంగా రూ. 40 పెరగడం గమనార్హం.
శ్రావణ మాసంలో చాలా మంది నాన్ వెజ్ కు దూరంగా ఉంటారు. ఎక్కువగా మహిళలు.. శ్రావణ శుక్రవారాలు పాటిస్తారు. అందుకే ఇక వారు ఈ నెలంతా ఇంట్లో మాంసాహారం వండకుండా తినకుండా ఉంటారు. దీనివలన చికెన్ ధరలు తగ్గడం అనేది సహాజమే. అయితే పూర్తిగా శ్రావణ మాసం అయిపోనప్పటికీ ధరలు ఇలా పెరగడం అందరిని షాక్ కు గురి చేస్తున్నాయి.
ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చికెన్ షాపు యాజమానులు చెబుతున్నారు. ఇక మటన్ ధరలు కేజీ ధర రూ. 800 నుండి రూ. 1000 మధ్య పలుకుతోంది. చికెన్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ గుడ్డు ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రూ. 7 పలుకుతోంది.
Related News
-
గణేష్ ఉత్సవాలంటే.. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి
-
అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్ధు..!
-
బీజేపీలో కవిత చేరికపై రాంచంద్రరావు క్లారిటీ
-
భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -మాజీ ఎమ్మెల్యే సండ్ర
-
ఎంపీ రవిచంద్ర లేఖకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూల స్పందన
-
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం