ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఘనంగా లైబ్రరీ వీక్ సెలబ్రేషన్స్
 
                                
నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో 2024 నవంబర్ 25వ తేదీ నుంచి 29 వరకు లైబ్రరీ వీక్ సెలబ్రేషన్స్ అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా లైబ్రరీల ప్రాముఖ్యతపై విద్యార్థులు నొక్కిచెప్పారు. పుస్తక పాత్రలకు ప్రాణం పోసి, కథల మాయాజాలాన్ని ప్రదర్శించే చక్కటి సమన్వయంతో కూడిన స్కిట్ ప్రేక్షకులను ఆనందపరిచింది. ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి యామిని హిమ బిందు ప్రసంగంతో కార్యక్రమం ముగిసింది, గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయడంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషిని ఆమె కొనియాడారు. పుస్తక పఠనం వలన పిల్లలకు జ్ఞానంతో పాటుగా సృజనాత్మకత పెంపొందుతుందని.. తప్పకుండా విద్యార్థులు చదవడం అలవాటుగా మార్చుకోవాలని ఆమె విద్యార్థులను ఉద్దేశించి తన ప్రసంగంలో తెలిపారు.
 
  
  
 

 
          



