జనసేనానిని ఆర్ధం చేసుకోని జనసైనికులు-ఎడిటోరియల్ కాలమ్

పల్లవి, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఆర్ధం చేసుకోవడం లేదా..?. సేనాని ఆలోచనలకు, చేస్తున్న పనులకు , మాట్లాడే మాటలకు పొంతన లేదని జనసైనికులు అనుకుంటున్నారా..?. అంటే అవుననే అంటున్నారు ఏపీ పాలిటిక్స్ క్రిటిక్స్. ఇటీవల తాడేపల్లి గూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వంలో ప్రధాన పార్టీ అయిన టీడీపీతో పోలుస్తూ తమ పార్టీ నాయకులకు స్వాతంత్య్రం తక్కువ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ అయిన టీవీ రామారావును ఎలాంటి తప్పు చేయకపోయినా, అసలు కారణమేమి లేకపోయినా తప్పించడాన్ని ఎమ్మెల్యే శ్రీనివాస్ గుర్తు చేశారు.
తాను చేసిన స్వాతంత్య్రం లేదనే వ్యాఖ్యలకు బలం చేకూరేలా మరికొన్ని ఊదాహరణలను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయం గురించి జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా పార్టీలో ఉండటం ఇష్టం లేనివాళ్లు వెళ్లిపోవచ్చని, తన వెంట ఉండాలని ఎవరినీ ప్రాథేయపడనని తేల్చి చెప్పిన మాటలను సైతం ఆయన గుర్తు చేశారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్పా..?. ఒప్పా..? అనే అంశం గురించి జనసేన పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కూడా. నిజానికి పవన్ మాట్లాడిన దాంట్లో ఎంతమాత్రం తప్పు లేదు. ఎందుకంటే ఏ విషయంలోనైనా పవన్ కళ్యాణ్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ చాలా స్పష్టంగా ఉంటున్నారు. కానీ తమ అభిప్రాయాల్ని, కోరికల్ని పవన్ పై రుద్ది, ఇలాగే మాకు నచ్చినట్లే పవన్ కళ్యాణ్ ఉండాలని జనసైనికులు కోరుకోవడం వల్లనే అసలు సమస్య ఉత్పన్నమవుతుంది. తమ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు ఆర్ధం చేసుకోవడంలో కాస్త ఆలోచించాలి. ఎందుకంటే టీడీపీతో ఇంకా 15 ఏళ్ల పాటు ఉంటానని పవన్ చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే జనసైనికులు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేస్తే మరి సేనాని ఊరుకుంటారని జనసైనికులు ఎలా అనుకుంటారు.?. చంద్రబాబుతో పొత్తు విచ్చిన్నానికి ఏ ఒక్కరు ప్రయత్నించినా ఆయన ఓర్చుకోరు . అందుకే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అయినా , టీవీ రామారావు అయినా, ఇంకా ఎవరైనా పవన్ కళ్యాణ్ కు లెక్క లేదని క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తనకిష్టమోచ్చినట్లు నచ్చినట్లు పార్టీని నడుపుతారు తప్పా ఆ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు అభీష్టం మేరకు జనసేనాను నడిపిస్తారని ఎవరైనా ఎలా అనుకుంటారనే ప్రశ్న ఎదురవుతోంది . కాబట్టి జనసేనాని బాటలో నడవటం తప్పా జనసైనికులకు ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే పవన్ ను నమ్ముకుంటే ఎలా కాపాడుకుంటాడో ఇప్పటికే పలుమార్లు నిరూపించారు కదా అని కొన్ని ఊదాహరణలను చెబుతున్నారు ఏపీ పాలిటిక్స్ క్రిటిక్స్.
Related News
-
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం – ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
-
భారీ ధర పలికిన బాలాపూర్ లడ్డూ
-
మహిళల ఆర్థికంగా అభివృద్ధి సాధించాలి- ఎంపీ కావ్య
-
సామాజిక కార్యక్రమాలకే ఎక్కువ సమయం కేటాయిస్తా -ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
-
వచ్చే సీజన్ కోసం కూలైన్లల్లో రైతులు -ఎంపీ రఘువీరారెడ్డి
-
శిల్పాశెట్టి దంపతులపై కేసు నమోదు