ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఘనంగా ఫెరియా-వై-ఫియస్టా 2.0 ప్రోగ్రామ్
 
                                
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఫెరియా-వై-ఫియస్టా 2.0 ప్రోగ్రామ్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో విభిన్న రంగాలలో విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించనున్నారు. “వేర్ ది పాస్ట్ మీట్ ది ఫ్యూచర్” అనే థీమ్‌తో బుధవారం ఈ ఈవెంట్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తో కలిసి మేనేజింగ్ డైరెక్టర్ మల్కా కొమరయ్య ప్రారంభించారు.

నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో సాంస్కృతిక, సృజనాత్మక, పరిశోధన, కళాత్మక, క్రీడా వంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొననున్నారు. ఈవెంట్ లో పాల్గొనే యువ విద్యార్థులను ఉత్సాహపరిచేందుకు “ట్యూన్స్ ఆఫ్ ట్రయంఫ్” పాటల మెలోడీతో మొదటి రోజును ప్రారంభించారు. ” ఎకోస్ ఎక్రాస్ ది ఎరా” అనే థీమ్‌ను సూచించే ఫ్యూజన్ డ్యాన్స్, స్పోర్ట్స్ ఈవెంట్లను టార్చ్ రన్ తో ప్రారంభించినట్లు ప్రకటించారు. టార్చ్ బేరర్లలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన పతకాలను గెలుచుకున్న DPS నాచారం విద్యార్థులు ఉన్నారు.

టార్చ్ బేరర్లలో పర్వతారోహణ ఛాంపియన్, ఎవరెస్ట్, కిలిమంజారో శిఖరాలను అధిరోహించిన గ్రేడ్ 12కి చెందిన ప్రీతం జితోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన పతకాలను గెలుచుకున్న DPS నాచారం విద్యార్థులు ఉన్నారు. ఈ ఈవెంట్లలో నాచారం DPSites సహా జంట నగరాల నుండి 50కి పైగా పాఠశాలలు, 4500కు పైగా విద్యార్థులు పాల్గొంటున్నారు. వీరంతా బిగ్గెస్ట్ షో “స్టూడెంట్ పవర్ అండ్ స్కిల్స్” కోసం సిద్ధమయ్యారు.

కాగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖలను పర్యవేక్షిస్తున్న M. గౌతం రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ మల్కా కొమరయ్య, M COO & డైరెక్టర్ యసస్వి, డైరెక్టర్ పల్లవి, M డైరెక్టర్ త్రిభువన, సీనియర్ ప్రిన్సిపాల్, R&R డైరెక్టర్ సునీత S రావు, జూనియర్ ప్రిన్సిపాల్ శాంతి ఆంథోని, తదితర ప్రముఖ అతిథులు పాల్గొన్నారు.

 
          



