విమాన ప్రమాదాలకు కారణాలివేనా..?

పల్లవి, వెబ్ డెస్క్ : అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరువలో లండన్ వెళ్లాల్సిన విమానం కూలిన ఘటనలో దాదాపు రెండోందల నలబై రెండు మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విమానం కూలిన హాస్టల్ బిల్డింగ్ లోపల లంచ్ చేస్తున్న ఇరవై మంది మెడికోల్ సైతం మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే అసలు విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. విమాన ప్రమాదాలకు మానవ పొరపాట్లు, సాంకేతిక లోపాలు, వాతావరణం అనుకూలించకపోవడం, ఏటీసీ సమస్యలు ప్రధాన కారణాలుగా చెబుతుంటారు.
ఫైలెట్లు లేదా సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ లోపాలు, నావిగేషన్ సమస్యల వల్ల కూడా తరచూ ప్రమాదాలు సంభవిస్తుంటాయి. నిర్వహణ లోపం వల్ల విమానంలోని యంత్రాలు మొరాయించడం కూడా ఒక కారణం. పక్షులు ఢీకొనడం , విమాన భాగాలు విరిగిపోవడం కూడా ప్రమాదానికి కారణమవుతాయి. అయితే తాజాగా అహ్మదాబాద్ ఘటనకు కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది.