యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం అతడే..!

పల్లవి, వెబ్ డెస్క్ : ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ జవహర్ నగర్ కాలనీలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే, తన కూతురి ఆత్మహత్య సంఘటనపై ఆమె తండ్రి శంకరన్న సంచలన ఆరోపణలు చేశారు.
తన కూతురు ఆత్మహత్యకు పూర్ణచందర్ అనే వ్యక్తే కారణం అని ఆరోపించారు. ‘ ఐదేళ్ల క్రితం నా కూతురు తన భర్తతో విడిపోయింది. ఆ తర్వాత తన కూతురితో కల్సి పూర్ణచందర్ తో ఉంటుంది.
పెళ్లి చేసుకోమంటే అతను తిరస్కరించాడు. ఈ నెల ఇరవై ఆరో తారీఖున నాకు ఫోన్ చేసి అతడితో ఉండలేనని స్వేఛ్ఛ వాపోయింది. ఇంతలోనే ఈ దారుణం చోటు చేసుకుంది. ఆమె మరణానికి అతడే కారణం. పూర్ణకు ఇతర మహిళలతూ కూడా సంబంధాలున్నాయని ఆయన తెలిపారు.