జ్యోతి మల్హోత్రా కేసులో ట్విస్ట్..!

పల్లవి, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నదనే ఆరోపణలతో అరెస్ట్ అయిన హరియాణాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి పోలీసులు సంచలనాత్మక విషయాలను తెలియజేశారు.
పోలీసుల విచారణలో జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో నేరుగా సంబంధాలున్నట్లు ఎక్కడా కూడా ఆధారాలు లేవు. జ్యోతి పూర్తి స్పృహాతోనే పాకిస్థాన్ నిఘా వర్గాలతో సంబంధాలను కొనసాగించారు అని ఈ కేసుకు సంబంధించి హిస్సార్ ఎస్పీ వివరాలు తెలిపారు.
ఆయన ఇంకా మాట్లాడూతూ ” జ్యోతి మల్హోత్రాకు ఉగ్రవాదులతో కానీ, ఉగ్రవాద సంస్థలతో కానీ సంబంధాలున్నట్లు మా దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆమె ఉగ్రవాద కార్యాకలపాల్లో పాల్గొన్నట్లు కూడా ఎలాంటి సాక్ష్యం దొరకలేదు. పాకిస్థాన్ నిఘా వర్గాలకు చెందిన అధికారిని పెళ్లి చేసుకోవాలని, మతం మారాలని నిర్ణయం తీసుకున్నట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు” అని ఆయన తెలిపారు.