రేప్ కేసులో నిందితుడ్ని పట్టించిన చీర…!

పల్లవి, వెబ్ డెస్క్ : కర్ణాటక లో సంచలనం సృష్టించిన పనిమనిషి అత్యాచార కేసులో మాజీ ప్రధానమంత్రి దేవెగౌండ్ మనమడు , జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు స్పెషల్ కోర్టు జీవిత ఖైదును విధించింది. రూ పది లక్షల జరిమానాతో పాటు బాధితురాలికి రూ ఏడు లక్షలు ఇవ్వాలని కూడా ఆదేశించిన సంగతి తెలిసిందే.
మాజీ ఎంపీ ప్రజ్వల్ దేవణ్ణ అఘాయిత్యానికి పాల్పడినట్లు పనిమనిషి పిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు గత ఏడాది మే ముప్పై ఒకటో తారీఖున ప్రజ్వల్ ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో మాజీ ఎంపీ ప్రజ్వల్ ను బాధితురాలి చీరే శిక్షపడేలా చేసింది.
రేప్ చేసిన తర్వాత పనిమనిషి చీరను ప్రజ్వల్ తన ఫామ్ హౌస్ లోని అటకపై పడేశాడు. పోలీసుల తనిఖీల్లో దాన్ని గుర్తించిన అధికారులు ఆ చీరను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. డీఎన్ఏ పరీక్ష ద్వారా చీరపై ఉన్న స్పెర్మ్ సెల్స్ ప్రజ్వల్ వేనని నిర్ధారించారు. అయితే బెంగళూరు స్పెషల్ కోర్టు ప్రత్యేక తీర్పునివ్వడానికి ఇదే ప్రధాన కారణమైంది.