కశ్మీర్ లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య..!

పల్లవి, వెబ్ డెస్క్ : కశ్మీర్ లో పని చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ జవాన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నర్సంపేట కు చెందిన సంపంగి నాగరాజు అనే ఇరవై ఎనిమిది ఏండ్ల యువకుడు గత మూడేండ్లుగా ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్నాడు.
దేశ రక్షణ కోసం సరిహద్దు భద్రతా దళంలో చేరి విధులు నిర్వర్తిస్తున్నాడు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మూడు రోజుల కిందట తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
నిన్న మంగళవారం స్వగ్రామానికి చేరుకున్న జవాన్ నాగరాజు మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పుత్రశోకంతో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.