పహల్ గామ్ దాడి ఉగ్రవాదుల ఆచూకీ లభ్యం

కశ్మీర్ లోని పహాల్ గామ్ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇరవై ఆరు మంది మృతి చెందారు. ఈ ఘటనపై భారత్ చాలా కఠిన చర్యలను తీసుకుంటుంది. ఈ చర్యల్లో భాగంగా ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కంకణం కట్టుకుంది.
పహాల్ గామ్ దాడిలో పాల్గోన్న ఉగ్రవాదుల ఆచూకీ ఎన్ఐఏ అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది. దక్షిణ కశ్మీర్ లోనే ఆ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ భద్రతా బలగాలు దాడి చేస్తే కవర్ పైర్ చేసేలా మరికొంత మంది ముష్కరులు సైతం అక్కడే ఉన్నట్లు తెలుస్తుంది.
లోయ ప్రాంతాల్లో ఉండటానికి వీలుగా ఆహారపదార్ధాల తో పాటుగా ఇతర నిత్యవసర మరియు అత్యవసర వస్తువులను వారి వెంట తెచ్చుకున్నట్లు భావిస్తున్నాయి. ఇప్పటికే పహాల్ గామ్ దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని ఇటీవల ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ప్రకటించిన సంగతి తెల్సిందే.