shobitha shivanna : శోభితది ఆత్మహత్యే.. కీలక విషయాలు వెల్లడించిన డీసీపీ
కన్నడ సీరియల్ నటి శోభితది ఆత్మహత్యేనని మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. ఆమె మృతిపై కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు.
కన్నడ సీరియల్ నటి శోభితది ఆత్మహత్యేనని మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. ఆమె మృతిపై కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. డిసెంబర్ 02వ తేదీ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నటనకు దూరంగా ఉండటం, అవకాశాలు లేకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నామన్నారు.
ఆయితే ఆమె అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు డీసీపీ వినీత్ . దీనిపై కుటుంబసభ్యులతోపాటు స్నేహితులను విచారిస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం శోభిత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు.
శోభిత ఆత్మహత్యపై ఆమె మామ బుచ్చిరెడ్డి స్పందించారు. శోభితను కన్నబిడ్డలా చూసుకున్నామని, తమతో బాగా కలిసిపోయిందని చెప్పారు. తన కుమారుడు సుధీర్ రెడ్డితో అన్యోన్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఇలా జరగడం దురదృష్టకరమని చెప్పారు.బ్రహ్మగంతు సీరియల్లో విలన్గా నటించిన నటి శోభితా శివన్నకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె మృతి పట్ల సీని ప్రముఖులు సంతాపం తెలిపారు.



