భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తిన్న భర్త..!

పల్లవి, వెబ్ డెస్క్ : సహాజంగా ఎవరైన తన భార్య అందరికంటే అందంగా ఉండాలి. అందుకు ఏమి చేయడానికైన వెనకాడని భర్తలున్న ఈరోజుల్లో ఏకంగా అందంగా ఉంది అని తన భార్య ముక్కు కొరుక్కు తిన్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే ” బాపన్ షేక్ , మధు ఖాతూన్ దంపతులు బేర్పారా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
రోజు భర్త బాపన్ తన భార్య ఖాతూన్ తో అవకాశం వస్తే నీ ముక్కు కొరికి తినేస్తానని అనేవాడంట. అయితే, ఈ నెల రెండో తారీఖున తెల్లారుజామున మూడు గంటల ప్రాంతంలో వారు ఉంటున్న ఇంట్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఒక్కసారిగా మధు ఖాతూన్ గట్టిగా కేకలు వేయడం విన్పించింది. ఆమె అరుపులతో చుట్టు పక్కల వారు ఒక్కవారిగా ఉలిక్కిపడ్డారు. ఆ ఇంట్లో నుంచి మధు గట్టిగా ఏడుస్తూ బయటకు వచ్చింది.
ఆమె ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం కావడం స్థానికులు గమనించారు. మధును అసలు ఏమి జరిగిందని అడగ్గా ఆమె చెప్పిన సమాధానంతో అవాక్కవ్వడం స్థానికుల వంతైంది. మధు మాట్లాడుతూ ” ఎప్పటి నుంచో అవకాశం దొరికితే నా ముక్కును కొరికి తినేస్తానని భర్త అనేవాడు.చివరకు అన్నంత పని చేశాడు అని ఆమె వాపోయింది. తన తల్లితో కల్సి శాంతిపూర్ పీఎస్ లో పిర్యాదు చేసింది.