భారీగా పడిపోయిన హరిహర వీరమల్లు కలెక్షన్లు

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘ హరిహర వీరమల్లు’ . మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీలో సుబ్బరాజు, బాబీ డియోల్, కోట శ్రీనివాసరావు, నాజర్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలో నటించారు.
‘హరి హర వీరమల్లు’ ఐదో రోజు కలెక్షన్లు భారీగా పడిపోయాయి. ఐదోరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.60 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటివరకు 52 శాతమే (రూ.108 కోట్ల గ్రాస్) రికవరీ అయినట్లు వెల్లడించాయి. మొదటి నాలుగు రోజుల్లో రూ. 105+ కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. బ్రేక్ ఈవెన్ చేయాలంటే ఇంకా రూ.62.48 కోట్ల కలెక్షన్లు రాబట్టాలని అంచనా వేశాయి.