దారిదోపిడి పాల్పడుతున్న నలుగురు దోపిడి దొంగలు అరెస్ట్
అర్ధరాత్రి దారిదోపిడి పాల్పడుతున్న బీర్బల్ సింగ్, నరేష్, భాగ్యందర్ సింగ్, రవి అని నలుగురు దోపిడి దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కూకట్ పల్లి ఏసిపి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు
కూకట్ పల్లి:- అర్ధరాత్రి దారిదోపిడి పాల్పడుతున్న బీర్బల్ సింగ్, నరేష్, భాగ్యందర్ సింగ్, రవి అని నలుగురు దోపిడి దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు కూకట్ పల్లి ఏసిపి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు. శుక్రవారం డివిజన్ పరిధి కేపిహెచ్ బీ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నలుగురు దారి దోపిడి దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కూకట్ పల్లిఏసిపి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేపిహెచ్ బీ ప్రాంతంలో అర్ధరాత్రి పూట దారి దోపిడికి పాల్పడుతున్న గండి మైసమ్మకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. నిందితులందరూ కుత్బుల్లాపూర్ మండలం గండి మైసమ్మ చౌరస్తా దగ్గరలో ఉన్న డబుల్ బెడ్ రూం హలో నివాసం ఉంటూ దారి దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితుల నుండి రెండు మొబైల్ ఫోన్స్ స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రావు, డి ఐ రవికుమార్ పాల్గొన్నారు.




