దారుణం .. ప్రేమించడం లేదన్న కోపంతో ప్రేమోన్మాది దాడి
వైజాగ్ లో దారుణం జరిగింది. తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఓ యువకుడు ఇనుప రాడ్తో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
వైజాగ్ లో దారుణం జరిగింది. తనను ప్రేమించడం లేదన్న కారణంతో ఓ యువకుడు ఇనుప రాడ్తో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్ కు చెందిన నీరజ్ శర్మ.. స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమించాలంటూ వేధింపులకు గురిచేస్తున్నాడు. కానీ ఆ యువతి పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహాంతో ఇనుప రాడ్తో యువతిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో యువతి కేకలు వేయగా.. స్థానికులు అక్కడికి చేరుకోగా నిందితుడు భయంతో పారిపోయాడు. దీంతో స్థానికులు యువతిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



