పోతావ్ రా రేయ్.. నాశనం అయిపోతావ్.. బాసర ఆలయంలో దొంగ హల్ చల్

బాసర ఆలయంలో గురువారం అర్థరాత్రి ఓ దొంగ హల్ చల్ చేశాడు. దాదాపుగా రెండు గంటలపాటు ఆలయంలో కలియతిరిగి ఓ హుండీని పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డాడు. చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే ఇంతజరుగుతున్నా హోంగార్డులు ఏం చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే.. రాత్రి 8.30 గంటలకు ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఈ క్రమంలో పోలీసుల కళ్లుగప్పి దొంగ రాత్రి 10.20 గంటలకు క్యూలైన్ల మీదుగా నడుచుకుంటూ వచ్చి గోశాల పైనుంచి ఆలయంలోకి దిగాడు. అక్కడి దత్తాత్రేయ ఆలయం ముందు ఏర్పాటు చేసిన హుండీని పగులగొట్టి అందులోని డబ్బును ఎత్తుకెళ్లాడు. ఆ తరువాత ప్రధాన ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా జాలీలు గట్టిగా ఉండటంతో సాధ్య పడలేదు.
దీంతో ఆలయం వెనకాల ఉన్న మరో హుండీని పగులగొట్టేందుకూ యత్నించిన కుదరలేదు. దీంతో చీరల కౌంటర్లోని రెండు ఖాళీ బ్యాగులను తీసుకుని ఆలయం ముందున్న ప్రసాదాల కౌంటర్‌ను ధ్వంసం చేశాడు. దాదాపు రెండు గంటలపాటు అక్కడక్కడే తిరిగి వెళ్లిపోయాడు. రాత్రి 03 గంటల సమయంలో ఆలయం లోపలికి వెళ్లిన హోంగార్డులు దొంగతనం జరిగినట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుమారు రూ.20 వేల వరకు చోరీ జరిగి ఉండొచ్చని ఆలయ ఈవో తెలిపారు.
బాసర అమ్మవారి ఆలయంలో చోరీ..
నిర్మల్ – బాసర అమ్మవారి ఆలయం లోపలికి గోడ దూకి ప్రవేశించి.. ఆలయంలోని చీరల విక్రయ కేంద్రం బీరువా, హుండీలను పగలకొట్టి చోరీ చేసిన దుండగుడు..
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు.. విచారణ జరుపుతున్న పోలీసులు.. pic.twitter.com/aQdg9nPz3k
— Telugu Scribe (@TeluguScribe) August 16, 2024