లిఫ్ట్ ఇస్తానని బైక్ పై ఎక్కించుకుని రూ. 10వేలు లాక్కెళ్లాడు

లిఫ్ట్ ఇస్తానని బైక్ పై ఎక్కించుకుని కొంతదూరం వెళ్లాక అతనిపై దాడి చేసి రూ. 10వేలు లాక్కెళ్లాడు ఓ అంగతకుడు. ఈ ఘటన పిఠాపురంలో చోటుచేసుకుంది. చేబ్రోలుకు చెందిన పెండ్యాల రామకృష్ణ అనే వ్యక్తి పిఠాపురంలో పని ముగించుకుని ఇంటి వెళ్తున్న సమయంలో లిఫ్ట్ ఇస్తానని ఓ అంగతకుడు బైక్ పై ఎక్కించుకున్నాడు. ఇల్లిందరాడ జంక్షన్ తరువాత ఆ వృద్ధుడిపై కర్రతో దాడి చేసి అతని దగ్గరున్న రూ.10వేలు లాక్కొని పారిపోయాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.